హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాన్ని వానలు వదలడం లేదు. పది రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మంగళ, బుధవారం అకడకడ వర్షాలతోపాటు గాలులు వీస్తాయని పేరొన్నది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లా గార్లలో అత్యధికంగా 2.78 సెం.మీ., ఆసిఫాబాద్ జిల్లా టీ సిర్పూర్లో అత్యల్పంగా 1.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.