Model School Teachers | బదిలీల కోసం ఎంతో ఆశగా వేచిచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ చెప్పింది. టీచర్ల బదిలీల షెడ్యూల్ను ఖరారుచేసి, విడుదల గుడ్న్యూస్ చేసింది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన టీచర్ల బదిలీల షెడ్యూల్ను విడుదల చేశారు. బదిలీల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభంకానుండగా.. మొత్తం ప్రక్రియ ఈ నెల 29తో ముగుస్తుంది. పూర్తిగా ఆన్లైన్ వెబ్బేస్డ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను చేపడుతారు. బదిలీల కోసం schooledu.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సూచించారు.
రాష్ట్రంలోని 194 మాడల్ స్కూళ్లల్లో 3వేల మంది టీచర్లు, 90 మంది ప్రిన్సిపాల్స్ పనిచేస్తున్నారు. గత 10ఏండ్లుగా వీరు నియామకమైన చోటే కొనసాగుతున్నారు. తాజా బదిలీల్లో వీరంతా స్థానచలనం పొందుతారు. అయితే, బదిలీలకు రెండేండ్ల కనీస సర్వీసు నిబంధనను అమలు చేస్తారు. ఇక జీవో -5 ప్రకారం బదిలీలు చేపట్టే అవకాశాలున్నాయి. మోడల్ స్కూల్ టీచర్లను జీవో-317 ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించలేదు. వీరి కేడర్ విభజన కేసు కోర్టులో పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతానికి పాత జోన్ల ప్రకారమే బదిలీలు చేపడుతారు.