నల్లగొండ : తెలంగాణలో మౌలిక వసతులు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార దాహంతో సీఎం కేసీఆర్పై అవినీతి మచ్చ వేస్తున్నారు. కాంగ్రెస్ సీట్ల కోసం అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేశారని నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు(MLC Ravinder Rao )అన్నారు. బుధవారం నల్లగొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. విజన్లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఫ్లొరైడ్ భూతాన్ని తరిమికొట్టిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో పంట ఎండిపోయింది అనే ఫిర్యాదు లేదు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇరవై ఏళ్లు నల్లగొండలో అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండ అభివృద్ధికోసం కాలుకు బలపం కట్టుకుని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తిరుగుతున్నారు.
కోమటిరెడ్డి ఆటలు నల్లగొండలో సాగవన్నారు. భూపాల్ రెడ్డి గెలుపు నల్గొండలో ఎప్పుడో ఖాయమైందన్నారు. ఎన్నికల టూరిస్టులను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జెడ్పీచైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, చెరుకు సుధాకర్, కటికం సత్తయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.