వ్యవసాయంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు.
- ఖమ్మం, హైదరాబాద్,గండుగులపల్లి ఎక్కడైనా రెడీ
- మంత్రి తుమ్మలకు ఎమ్మెల్సీ తాతా మధు సవాల్
ఖమ్మం, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు. మంత్రి స్వగ్రామమైన గండుగులపల్లి లేదా ఖమ్మం, హైదరాబాద్ ఎక్కడైనా సరే చర్చకు రెడీగా ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుపై మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలను తాతా మధు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయ న మీడియాతో మాట్లాడారు. వ్యవసాయరంగాన్ని కేసీఆర్ విస్మరించారని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. గతం లో మంత్రిగా పనిచేసిన తుమ్మల పాలే రు నియోజకవర్గంలో భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించాలనే ఆలోచన ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టు ‘భక్తరామదాసు’ ను తుమ్మల చేతుల మీదుగా పూర్తిచేసింది నిజంకాదా? అని గుర్తుచేశారు. రైతుబంధు సక్రమంగా ఇవ్వలేదని మంత్రి తుమ్మల అబద్ధాలు మాట్లాడుతున్నట్టు మండిపడ్డారు. ఆయన స్వగ్రామం గండుగులపల్లిలోని రైతులందరికీ రైతుబంధు వచ్చిందా? లేదా అనే దానిపై చర్చకు సిద్ధమా అని అడిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

