కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఒక వీడియో శనివారం రాజకీయ వివాదానికి దారితీసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ జాతీయ గీతం వందేమాతరం పూర్తిగా ఆలపించడాన్ని నిలిపివేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నట్టుగా సైగలు చేయడం ఆ వీడియోలో కనిపించింది.
తర్వాత రాహుల్ గాంధీ కూడా అదే విధంగా స్పందించినట్టు కనిపించడంతో సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. ఆ వీడియో, దానికి సంబంధించిన ఆరోపణల గురించి విలేకరులు ప్రశ్నించగా అందులో ఎలాంటి వివాదం లేదు. పార్టీ విధానం గురించి కాంగ్రెస్ అధిష్ఠానం లేదా జైరామ్ రమేశ్ వివరణ ఇస్తారు అని పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ అన్నారు.
– న్యూఢిల్లీ