స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన త్రివర్ణ పాకెట్ స్కేర్ల అమరికపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా ఎక్స్‌లో ఆ ఫొటోను పంచుకుంటూ ప్రధాని భారత్‌కు బదులుగా ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు ఉన్నదని వ్యాఖ్యానించారు. ఐరిష్ జెండాలోని రంగుల అమరికను అవి పోలి ఉన్నాయని పరోక్షంగా పేర్కొన్నారు.
– న్యూఢిల్లీ