MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనపై ఈడీ చేసిన తప్పుడు ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను ఆమె తప్పుబట్టారు. తన పట్ల దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గతంలో తాను వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడమంటే గోప్యత హక్కుకు భంగం కలించినట్లు కాదా అని ఆ లేఖలో ఈడీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న ఈడీ.. ఇప్పటివరకు తాను ఉపయోగించిన ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపిస్తుందని మండిపడ్డారు. కనీసం ఆ ఫోన్ల గురించి అడగకుండానే ఒక దర్యాప్తు సంస్థ ఇలాంటి అరోపణలు ఎలా చేస్తుందని నిలదీశారు. తనను తొలిసారిగా మార్చి నెలలోనే ఈడీ విచారణకు పిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ గత ఏడాది నవంబర్లోనే ఫోన్లను ధ్వంసం చేశానని ఈడీ ఆరోపిస్తుందని తెలిపారు. అంటే ఇవి దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలే అని ఆమె అన్నారు. తప్పుడు ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు ప్రజల ముందు దోషిలా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తన ప్రతిష్టకు తీవ్ర భంగం జరిగిందన్నారు. తన పరువును, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు.
#MLCKavitha | మూడోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత.. వెళ్లేముందు ఫోన్లను మీడియాకు చూపించిన ఎమ్మెల్సీ pic.twitter.com/W3nsYjyGhH
— Namasthe Telangana (@ntdailyonline) March 21, 2023
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న మొబైల్ ఫోన్స్‌ను కూడా ఆమె విచారణకు తీసుకెళ్లారు. అంతకుముందు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయల్దేరిన సమయంలో.. ఆ మొబైల్ ఫోన్స్‌ను కవిత మీడియా ముందు చూపించారు.
Kavitha1
Kavitha2
MLC Kavitha | మూడోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత.. వెళ్లేముందు ఫోన్లను మీడియాకు చూపించిన ఎమ్మెల్సీ