హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): నల్లబంగారంగా పేరొందిన బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా, తెలంగాణ సిరులవేణిగా, అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ 103వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంస్థ కార్మికులు, సిబ్బందికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో బొగ్గు ఉత్పత్తిలో, లాభాల్లో, కార్మికుల సంక్షేమంలో దేశంలోనే సింగరేణి నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి సంస్థను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ చేస్తున్న పన్నాగాలను అడ్డుకొంటామని, సంస్థను కాపాడుకొంటామని శుక్రవారం ఆమె ట్విట్టర్లో తెలిపారు.