హైదరాబాద్ : బిల్కిస్ బానో(Bilkis Bano) కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు సుప్రీంకోర్టు(Supreem court) ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్వాగతించారు. ఈ మేరకు కవిత ‘ఎక్స్’ లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు.
కాగా, బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.
I welcome Hon’ble Supreme Court’s reversal of the acquittal ruling for the convicts of Bilkis Bano.
While her pain is unparalleled, this verdict sends a powerful message: the unwavering commitment to women’s integrity. Justice prevails, every such verdict sets a crucial… https://t.co/Rdrg6TOFnZ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 8, 2024