హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా శుక్రవారం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల భారీ అంబేదర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వం వహించనున్నారని పేర్కొన్నది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ సిందూర్ను ప్రతిఒకరూ బలపరచాలని, వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా వెన్ను దన్నుగా నిలవాలని జాగృతి సంస్థ విజ్ఞప్తి చేసింది. ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది.