హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అక్టోబర్‌లో నిర్వహించనున్న ‘లండన్-చేనేత బతుకమ్మ-దసరా’ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటల నుంచి వెస్ట్ లండన్‌లోని ‘లంప్టోన్ సూల్’ ఆడిటోరియంలో నిర్వహించే వేడుకుల్లో ప్రవాసులంతా చేనేత దుస్తులు ధరించి పాల్గొనాలని టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల కోరారు. మరిన్ని వివరాలకు www.tauk.org.uk వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. పోస్టర్ ఆవిషరణలో మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్, టాక్ వ్యవస్థాపకుడు, తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, తెలంగాణ సామాజిక కార్యకర్తలు తిరుమందాస్ నరేశ్‌గౌడ్, బత్తిని వినయ్, నాగరాజు పాల్గొన్నారు.