హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రైతు భరోసా నిధుల విడుదలలో తాత్సారంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకకాలంలో రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయాలని, అలాగే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. గురువారం పలువురు మాజీ సర్పంచులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో కలిగే ఇబ్బందులను కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతుబంధు నిధులు ‘టంగ్ టంగ్’ మని రైతుల ఖాతాల్లో పడేవని, రేవంత్‌రెడ్డి సరార్లో మాత్రం దశలవారీగా నామమాత్రపు నిధులు మాత్రమే విడుదల చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేసిన గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులను మోసం చేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
వేసవికి ముందే గోదావరిని ఏడారి చేశారంటూ రేవంత్ సరార్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేసీఆర్‌పై కక్షలో భాగంగా సజీవ జలధార వట్టిపోయేలా చేశారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరిని బీఆర్ఎస్ ప్రభుత్వం సజీవ జలధారగా మార్చిందని, మండే ఎండలోనూ నిండుకుండను తలపించేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఫిబ్రవరిలోనే గోదావరి వట్టిపోయి ఎడారిని తలపిస్తున్నదని, ఏప్రిల్, మేలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తంచేశారు.
తలాపునే గోదావరి ఉన్నా గుకెడు నీటి కోసం మళ్లీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం ‘గ్యారెంటీ’గా తెచ్చిందని విమర్శించారు. ‘కేసీఆర్ హయాంలో నీటితో కళకళలాడిన గోదావరి నది.. నేడు వేసవి రాకముందే ఎడారిని తలపిస్తున్నది. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్‌బెల్ట్ బ్రిడ్జి వద్ద నిండుగా నీళ్లు ఉండేవి. ప్రస్తుతం ఆ బ్యారేజీలో కాంగ్రెస్ సరార్ నీటిని నిల్వ చేయకపోవడంతో అకడి గోదావరిలో చిన్న ప్రవాహమే ఉంది’ అని గోదావరినదిలో ఇసుక తేలిన దృశ్యాలను ఆమె పోస్టు చేశారు.
14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను రేవంత్సర్కార్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసిందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ముందుచూపుతో కేసీఆర్ పాలమూరుకు 90 టీఎంసీల నికరజలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెకించే ప్రయత్నం చేస్తే, ఆ విషయాన్ని కేంద్రానికి సరిగా చెప్పలేక తుది అనుమతులను మరింత సంక్లిష్టం చేసిందని విమర్శించారు. ఫలితంగా కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తేల్చి చెప్పిందని ధ్వజమెత్తారు.