హైదరాబాద్ : కులగణనకు చట్టబద్దత ఉందోలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి డెడికేటెడ్ కులగణన కమిషన్కు 35 పేజీలతో తెలంగాణ జాగృతి ఆధ్యర్యంలో చేపట్టిన సమగ్ర నివేదికను కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం బీసీలకు ఎంతో న్యాయం చేసిందన్నారు.
కులగణకు(Caste census) బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద వైఖరిని బీసీలు ఖండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.