MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: ఎమ్మెల్సీ కవిత
కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్: కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలున్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు.
కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి జరిగిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాజెక్టులను ధారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభ, మండలిలో తీర్మానం తీసుకరావాలని, తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని చెప్పారు. తెలంగాణ హక్కుల విషయంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పటం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. గతంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభ, మండలిలో తీర్మానం తీసుకరండి. మీ పాపాలను ప్రక్షాళన చేసుకోండి. తెలంగాణ హక్కుల విషయంలో… pic.twitter.com/30Z3OWL8mo
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 12, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM Revanth Reddy
- Congress
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

