సారంగపూర్ : దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి మూలం భారత రాజ్యాంగమని( Indian constitution) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని నాగునూరు గ్రామంలో అవమానానికి గురైన డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా దుర్మార్గులు ఆ మహాత్ముడిని అగౌరవ పరిచినట్టు అయితే ఆ అవమానం మహాత్మునికి కాదు ఈ సమాజాన్ని ఆ గౌరవ పరిచినట్టుగా భావించాలన్నారు.
అలాంటి ద్రోహులు ఎవరు అయిన చట్టపరిధిలో శిక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంద న్నారు. ఈ దురదృష్టకర సంఘటనపై బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేడు యావత్ ప్రపంచ దేశాలు అన్ని కూడా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి రాజ్యాంగాన్ని అందించిన ఘనత బాబా సాహెబ్ అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంచంద్ర రెడ్డి, జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, ధర్మపురి ఏఎంసీ డైరెక్టర్ రవి, మాజీ ప్రజప్రతినిధులు రాజయ్య, విమల సుధాకర్, జమున రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరీష్, జగిత్యాల రూరల్ మండల కాంగ్రెస్ అద్యక్షుడు మధు, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పూడురి శోభన్, నాయకులు గంగాధర్, అసాది రాజన్న, లవణ్, తిరుపతి, అప్పల స్వామి, వాసం శ్రీనివాస్, గోపన్న, బేర మహేష్, మాజీ కౌన్సిలర్స్ నక్క జీవన్, మోగిలి సింగరావు, నక్క విజయ్, నక్క రమేష్, గంగారాం, శేఖర్, చందు, రాజశేఖర్ రెడ్డి అజయ్, తదితరులు పాల్గొన్నారు.