జగిత్యాల, జూన్ 16 : బీఆర్ఎస్ హయాంలో చేసిన విద్యుత్తు ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీని కేసీఆర్ కించపరుస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో పవర్ ప్రాజెక్ట్ ఇవ్వడంతో తెలంగాణ రూ.40 వేల కోట్లు అప్పుల పాలైనట్టు ఆరోపించారు. కమిషన్ విచారణకు కేసీఆర్ సహకరించకపోవడం సరికాదని అన్నారు.