హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): సమానత్వ దినోత్సవంగా పాటించే ఏప్రిల్ 14వ తేదీనైనా హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ సర్కార్ బంధించిన అంబేద్కర్ విగ్రహానికి విముక్తి కలిగేనా? సామాన్యులకు ఆ మహనీయుడి విగ్రహ సందర్శన భాగ్యం కలిగేనా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్పై కక్షతో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి సంకెళ్లు వేయడం ప్రజాస్వామ్యానికే అవమానమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరంకుశ విధానాలు, మూర్ఖపు పాలనకు పరాకాష్ట అని సోమవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.