బీఆర్ఎస్తోనే ‘పోడు’కు పరిష్కారం
బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే దశాబ్దాల పోడు సమస్యకు పరిష్కారం దొరికిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్‌లో మండలంలోని గిరిజనులకు సుమారు 400 ఎకరాలకు పోడు పట్టా పాసుపుస్తకాలను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి అందజేశారు.
- అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 5 : బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే దశాబ్దాల పోడు సమస్యకు పరిష్కారం దొరికిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్‌లో మండలంలోని గిరిజనులకు సుమారు 400 ఎకరాలకు పోడు పట్టా పాసుపుస్తకాలను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.
ఇక దర్జాగా సాగు: మంత్రి వేముల
రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడుభూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలను సాగు చేసుకోవచ్చని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ (డీసీ తండా)లో లబ్ధిదారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ పోడు భూముల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ సీజన్ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేస్తుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో 817మంది గిరిజనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోడు పట్టాలు అందజేశారు.
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు..
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని పలు తండాల గిరిజనులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పోడు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి సామ్యాతండాకు చెందిన గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో పోడు భూములకు పట్టాలకు పంపిణీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

