అయిజ, జనవరి 25 : ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. గత పదేండ్లలో మున్సిపాలిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కలిసికట్టుగా శ్రమించి బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అలంపూర్ నియోజకవర్గంలో వసూల్ రాజాలు పెరిగారని ఆరోపించారు. అలాంటి వసూల్ రాజాలకు మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వొద్దని ప్రజలను కోరారు. అనంతరం పులికల్కు చెందిన 200 మంది బీఆర్ఎస్లో చేరగా వీరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.