తిరుమల: టీటీడీ బోర్డు డైరెక్టర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.