హైదరాబాద్ : ఫుట్ పాత్ వ్యాపారుల(Footpath vendors) సమస్యలను పరిష్కరిస్తామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. జీహెచ్ఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్ట్రీట్ వెండర్స్లో అధికంగా పేదలు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు మానవతాదృక్పధంతో వ్యవహరించాలన్నారు. 23 వ తేదీన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..