Akshay Kumar | ఓటీటీల వలనే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి : అక్షయ్ కుమార్
OTT platforms | ఓటీటీ (ఓవర్ ది టాప్)ల వలనే థియేటర్లో వచ్చే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అన్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఆయన నటించిన తాజా చిత్రం విడుదలకు సిద్ధమవ్వగా.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గోన్న ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
Akshay Kumar OTT | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటీటీ(Akshay Kumar )లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. థియేటర్లో వచ్చే సినిమాలు ఓటీటీ (ఓవర్ ది టాప్)ల వలనే ఫ్లాప్ అవుతున్నాయని తెలిపాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’(Sky Force). ఈ సినిమాతో వీర్ పహరియా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండగా.. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. భారత దేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందగా.. ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్లపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇండియన్ సినిమా ప్రస్తుతం ఎందుకు ఇంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది?.. ఎందుకు సక్సెస్ రేట్ ఎందుకు ఇంత తక్కువగా ఉందని మీడియా అక్షయ్‌ని ప్రశ్నించగా.. అక్షయ్ సమాధానమిస్తూ.. ఓటీటీల వలనే సినిమాలు థియేటర్లో ఆడకుండా ఫ్లాప్ అవుతున్నాయని వెల్లడించాడు.
నేను ఈ మధ్య కొంతమందిని కలిసినప్పుడు వారితో సినిమాల గురించి మాట్లాడాను. అయితే వారు సినిమాలు థియేటర్లో కాకుండా ఓటీటీలో చూస్తున్నాం అని చెబుతున్నారు. ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర రన్ అవ్వకుండా ఫ్లాప్ అవ్వడానికి ఇదే ముఖ్య కారణం. కరోనా వేవ్ తర్వాత కూడా ఓటీటీలకు అలవాటైన ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్‌కి రావడం క్రమంగా తగ్గించారు. ఈ మధ్య ఈ అలవాటు బాగా పెరిగింది అని తెలిపాడు. ప్రేక్షకులు కూడా ఈ మధ్య సెలక్టివ్‌గా సినిమాలు చూస్తున్నారు. వారికి సినిమా నచ్చితేనే థియేటర్‌కి వెళుతున్నారు. లేకుంటే అదే సినిమాను ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి చూస్తున్నారు అంటూ అక్షయ్ చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

