MLA Sudarshan Reddy | మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ కృషి : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
MLA Sudarshan Reddy | మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో మహిళలకు 500 కుట్టు మిషన్లను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
నర్సంపేట, అక్టోబర్5 : మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో మహిళలకు 500 కుట్టు మిషన్లను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్నదని అన్నారు. వారికి అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు.
మహిళలకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి ఉపాధి, వ్యాపార రంగంలో రాణించేలా ప్రొత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా నియోజకవర్గంలో 3500 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఉచితంగా కుట్టు మిషన్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మళ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఓట్ల సమయం రాగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. వారి మాటలను మహిళలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకట నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

