షాబాద్, ఏప్రిల్ 12: బీఆర్ఎస్ రజతోత్సవ మీటింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే వరంగల్ చుట్టుపక్కల ఆంక్షలు పెట్టారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి హాజరై మాట్లాడారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ మీటింగ్ పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్లకు ఇప్పుడే భయం పట్టుకుందని చెప్పారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా కేసీఆర్ మీటింగ్‌కు వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రజలను కోరారు.
మొయినాబాద్, ఏప్రిల్ 12: మొయినాబా ద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కేపల్లికి చెందిన న్యాలట నర్సమ్మ, న్యాలట యాదమ్మ, న్యా లట పాపమ్మ, మంగళి భిక్షపమ్మలు రజతోత్స వ సభకు చందాగా పెన్షన్ డబ్బులను మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి శనివారం అం దించారు. ‘పదేండ్ల క్రితం రూ. 200 ఉన్న పింఛన్‌ను కేసీఆర్ సీఎం అయిన తర్వాత రూ. 2 వేలు ఇచ్చిండు. పింఛన్ రూ.4వేలు ఇ స్తామని కాంగ్రెసోళ్లు చెప్పడంతో నమ్మి మోసపోయాము. మళ్లీ కేసీఆర్ సారే రావాలి’ అని పింఛన్ డబ్బులు విరాళంగా ఇచ్చామని లబ్ధిదారులు సబితారెడ్డికి తెలిపారు.