మానకొండూర్ రూరల్, మే 25: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం కింద బీజేపీ నేత కూతురికి రూ.1,00,016 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వారి ఇంటికెళ్లి అందజేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు శానగొండ రవి కూతురు శ్వేత వివాహం ఇటీవల జరిగింది.
ఆయన కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం రూ.1,00,016లు మంజూరు చేసింది. గురువారం తొలిపొద్దు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారి ఇంటికెళ్లి రవి భార్య మంగకు చెక్కు అందజేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరికీ పథకాలను వర్తింపజేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.