బచ్చన్నపేట సెప్టెంబర్ 2 : తెలంగాణ వచ్చినంకనే గుడి చెరువు నిండిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ బచ్చన్నపేటకు వచ్చినప్పుడు రోడ్లపై ముసలోళ్లు తప్ప, యువకులు కనబడలేదని దాంతో కెసిఆర్ కంట తడిపెట్టి స్వరాష్ట్రం సాధించు కుంటేనే బాధలు తీరుతాయని అని చెప్పారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఇటీవల ప్రమాదంలో గాయపడి కోలుకున్న తర్వాత మొదటిసారిగా బచ్చన్నపేట వచ్చిన సందర్భంగా పోచన్నపేట నుంచి బచ్చన్నపేట గ్రామం దాటే దాకా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ బచ్చన్నపేట అని అన్నారు. 2001 నుంచి 14 వరకు ప్రతి గ్రామం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ మీటింగులు పెట్టిన కెసిఆర్ బచ్చన్నపేట గురించి ప్రస్తావించాడని గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ కాగానే గోదావరిజాలలతో బ చ్చన్నపేట గుడి చెరువు నింపడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ శిక్షించాలన్న దుర్బుద్ధితో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. ఆ కాళేశ్వరం వద్దని బనకచర్లకు గోదావరి జలాలు తరలించబోతున్న ఇక్కడ నేతలు పట్టించుకోవడంలేదన్నారు.
మన నీళ్లను చంద్రబాబు దోచుకే కెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉన్నప్పటి పదేళ్లలో ఏ రోజన్న రైతుల యూరియా కోసం రోడ్ ఎక్కారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు, రైతులకు కష్టాలు మొదలు అవుతున్నాయని అన్నారు. జనగామ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు వచ్చే మూడేళ్లలో తన హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు.
నియోజకవర్గం అంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచందర్, సర్పంచులు, ఎంపీటీసీల పోరమ్ మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, దూడల కనకయ్య, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షులు చల్లా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.