రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణం
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు, మక్కజొన్న పంటను వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- కొనుగోలు కేంద్రాల్లో రోజురోజుకూ పేరుకుపోతు ధాన్యం బస్తాలు
- కొనుగోలు కేంద్రాల దుస్థితిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్
హనుమకొండ, మే 21 : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు, మక్కజొన్న పంటను వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని పల్లా నివాసంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ము ఖ్య నాయకుల వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాసర్, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, ని యోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. వరి, మకజొన్న కొనుగోలు కేంద్రాల దుస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పై విసృ్తతంగా చర్చించారు.
అనంతరం ఎమ్మె ల్యే రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, మకజొన్నలు పేరుకుపోయి నా తరలించే పరిస్థితి లేదని అన్నారు. ఎకడ చూసినా బస్తాల కొరత తీవ్రంగా ఉన్నదని, కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరుగడం లేదని విమర్శించారు. ఇప్పటికే లిఫ్ట్ చేసిన ధాన్యాన్ని కూడా అన్లోడ్ చేయకుండా నిల్వ ఉంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ఐకేపీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని అన్నారు. కోటి టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు 25 శాతం కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. వడదెబ్బ, గుండెపోట్లతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

