ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్ర రమణా రెడ్డి చేతుల మీదుగా హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో ఆవిష్కరించారు.
వరంగల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నదమవుతున్న విద్యార్థి, నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్ర రమణా రెడ్డి చేతుల మీదుగా హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో కలిపి లక్షా 67 వేల ఉద్యోగాలు ఇచ్చింది.
పరోక్షంగా ప్రయివేటు రంగంలో స్వాతంత్య భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాలు కల్పించార న్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఉన్న ప్రయివేటు కంపెనీలు తరలి వెళ్లే పరిస్థితి వచ్చి ఎక్కడా ఉద్యోగ కల్పన జరగడకపోవడం దుర్మార్గం అన్నారు. ప్రతిఆ రెండేళ్లకోసారి పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అనవాయితీగా ఉండేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలల కావొస్తున్నా ఒక్క పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. విద్యారంగాన్ని సైతం నిర్వీర్యం చేసే కుట్ర సాగుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా అధ్యాపక పోస్ట్ లు భర్తీ చేయడం లేదు.
ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అని నోటికొచ్చిన హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్లేట్ పిరాయించారని మండిపడ్డారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉన్నత విద్యావంతుడు నిరుద్యోగ యువత సమస్యలు నిత్యం వారు పడే కష్టాలు చూసే వ్యక్తి కాబట్టి మీ అందరి కోసం Rakesh Reddy E-Classes యాప్ ను రూపొందించిన ఉచితంగా మీకు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రొఫెసర్ తిర్నారి శేషు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుకుమార్, ప్రముఖ న్యూరో వైద్యులు నవీన్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

