కృష్ణా, భీమా పరవళ్లు
జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు బుధవారం ఇన్‌ఫ్లో 2,45,000 క్యూసెక్కులు రాగా అవుట్ ఫ్లో 2,48,971 క్యూసెక్కులు నమోదైంది. వరద నిరంతరాయంగా కొనసాగడంతో మంగళవారం రాత్రి నుంచి 33 గేట్లు ఎత్తి శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తున్నారు.
- జూరాల ప్రాజెక్టులో 33 గేట్లు ఎత్తివేత
- కర్ణాటకలోని గూగల్ బ్యారేజీ నుంచి 40 గేట్లు ఎత్తివేత
- శ్రీశైలానికి కొనసాగుతున్న నీటి ప్రవాహం
- తుంగభద్రకు ఇన్‌ఫ్లో
- ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్ప వరద
గద్వాల/ఊట్కూర్/శ్రీశైలం/అయిజ, ఆగస్టు 5 : జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు బుధవారం ఇన్‌ఫ్లో 2,45,000 క్యూసెక్కులు రాగా అవుట్ ఫ్లో 2,48,971 క్యూసెక్కులు నమోదైంది. వరద నిరంతరాయంగా కొనసాగడంతో మంగళవారం రాత్రి నుంచి 33 గేట్లు ఎత్తి శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.38 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెకు ్ట పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.426 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నుంచి 33 గేట్ల ద్వారా దిగువకు 2,18,790 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా విద్యుత్ ఉత్పత్తికి 26,208 క్యూసెక్కులతోపాటు కాల్వలు, ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.
గూగల్ బ్యారేజీ 40 గేట్లు ఎత్తివేత..
కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా కృష్ణా నదిపై నిర్మించిన గుర్జాపూర్, యాద్గీర్ జిల్లా గూడూరు భీమా నదిపై ఉన్న గూగల్ బ్యారేజీకి వరద నీరు పోటెత్తడంతో కృష్ణానదికి కొద్ది రోజులుగా నీటి ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం గూగల్ బ్యారేజీకి చెందిన 40 గేట్లను ఎత్తి దిగువన భీమా నదికి నీటి విడుదల చేపట్టారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద జలాలు తెలంగాణలోని కృష్ణ, మాగనూర్, మక్తల్ మండలాల మీదుగా జూరాల ప్రాజెక్టుకు చేరుతుండటంతో నదీ పరీవాహక ప్రాంతం మొత్తం జలకళను సంతరించుకుంది.
శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో..
శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. బుధవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 2,18,790 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, విద్యుదుత్పత్తి ద్వారా 26,208 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 2,44,998 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరిన ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులకు గానూ ప్రస్తు తం 866.90 అడుగులు, పూర్తిస్థాయి నీటి సా మర్ధ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 129. 4646 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తుంగభద్రకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద చేరుతోంది. బుధవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 66,152 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,496 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల తాగునీటి అవసరాల కోసం నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు. టీబీ డ్యాం గరిష్ఠస్థాయి నీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1620.50 అడుగుల నీటి మట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను, ప్రస్తుతం 62.740 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్ప వరద..
కర్ణాటకలో కురుస్తున్న వానలకు ఆర్డీఎస్ (రాజోలి బండ డైవర్సన్ స్కీం)కు వరద స్వల్పంగా చేరుతోంది. మంగళవారం వరకు ఒట్టిపోయినన ఆర్డీఎస్ ఆనకట్టకు వాగులు, వంకల నుంచి వరద నీరు చేరుతోందని కర్ణాటక డీఈ శాంతరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు ఆనకట్ట 3 అడుగులకు చేరుకున్నదని తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

