Padi Kaushik Reddy | తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్
Padi Kaushik Reddy | కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా..? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా..? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
Padi Kaushik Reddy | కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్టేజీపైనే ఫైర్ అయ్యారని తెలిసిందే. ఈ విషయమై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ మీద ఆర్థిక భారం వేశాడని అబద్దాలు చెప్పే ప్రయత్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తే మీరు తప్పు చెబుతున్నరు సార్.. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు ఆఫీషియల్ మీటింగ్.. మీరు నిజాలు చెప్పండని అని చెప్పిన. సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పొచ్చా.. అని హితవు పలికారు.
ఇవాళ మేం చెప్పిన లెక్క కాదు కదా.. కేంద్రమంత్రి, బీజేపీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు అసలు తెలంగాణ ఎంత అప్పులున్నయని పార్లమెంట్లో ప్రశ్న వేస్తే రూ. 2.85 లక్షల కోట్లు అప్పు మాత్రమే ఉన్నయని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మేం చెప్పింది కాదు కదా ఇది.. కేంద్రప్రభుత్వమే చెప్పింది కదా.. మరి ఇంకా సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నరు. మీరు ఎందుకు అబద్దాలు చెప్తున్నరు.. ఇట్లాంటి అబద్దాలు చెప్పొద్దని నేను శ్రీనివాస్రెడ్డిని అడిగితే వారికి కోపమొస్తుంది. కానీ మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే నేను కౌశిక్ రెడ్డిని అది గుర్తు పెట్టుకోండి. అందరూ ఎమ్మెల్యేల లాగా కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు.. కానీ కౌశిక్ రెడ్డి కేసీఆర్ దగ్గర ట్రైన్ అయిన శిష్యుడిని నేను.. అది గుర్తు పెట్టుకోవాలే మీరు అని హెచ్చరించారు.
కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా..? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా..? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి..?ఈ రోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అని సూచించారు. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశాడని మంత్రి పొంగులేటి అబద్ధాలు చెబుతుంటే అడ్డుకున్నాను
ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు ఆఫీసియల్ మీటింగ్.. నిజాలు చెప్పండని చెప్పాను
రూ. 2.85 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేశారని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది
అందరూ ఎమ్మెల్యేల లాగా కౌశిక్… https://t.co/gCsDrBmqPf pic.twitter.com/x7e3ZDMpjY
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026
కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా?
పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా?
కేసీఆర్, కేటీఆర్ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి… https://t.co/BhTNJjKHkm pic.twitter.com/q1eDmxpAGv
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026
Read Also :
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

