హైదరాబాద్/కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 10: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్న అధికారులపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. నియోజకవర్గ ప్రజల మద్దతుతో విజ యం సాధించానని, వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుంటే, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం చేటట్టే పనులు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నా, స్థానిక అధికారుల తీరు బాగా లేదని చెప్పారు. తన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన స్పీకర్, ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు అధికారులపై చర్యలకు ఆదేశించినట్టు తెలిపారు.