హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏల సాధనకు త్వరలోనే ఉద్యమించనున్నట్టు ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్ ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, విద్యాసదస్సును ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రొఫెసర్ కాసీం, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి హాజరై పలు అంశాలపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా సదానందంగౌడ్ మాట్లాడుతూ.. సర్వీస్‌రూల్స్ సమస్యను పరిష్కరించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ టీచర్లకు మినిమం టైం స్కేల్ మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్లు గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ, హెడ్ సెక్రటరీ కరుణాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏవీ సుధాకర్, పోల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.