హనుమకొండ, జూన్ 27 : ప్రభుత్వం పేదల గుడిసెలను ఎట్ల కూలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేదల ఇండ్ల స్థలాల కోసం వరంగల్ నుంచే పోరా టం ప్రారంభించి ప్రభుత్వం దిగొచ్చేవరకు కొ నసాగిస్తామని ప్రకటించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పేదల గుడిసెలను ప్రభు త్వం కక్షగట్టి కూల్చేసిందని శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్ వద్ద గుడిసెవాసులతో కలిసి ధర్నా చేశారు. అక్కడినుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీగా వెళ్తు న్న వామపక్ష నాయకులను అదాలత్ సెంటర్‌వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో తోపులాట జరుగగా, సాంబశివరావు, సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సహా పలువురి ని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. జూలై ఒకటిన హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదు ట పికెటింగ్ నిర్వహించి, 6న హైదరాబాద్‌లోని ఇందిరాపారు వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగిస్తామంటే ప్రజలు ఊరుకోరని జాన్‌వెస్లీ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.