హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద అన్నారు. కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడని కడియం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నాడు. కడియం లాగ కేసీఆర్ ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని తాకట్టు బెట్టుకొని, పదవుల కోసం పాకులాడి, బేరసారాలు చేయలేదన్నారు.
తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, 13 సంవత్సరాలు నిరంతరం పోరాడాడని ఇదే కడియం శ్రీహరి అనలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయనకే తెలియాలన్నారు. రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చిన నీ లాంటి వారు కేసీఆర్ను అనే అర్హతల లేదని విమర్శించారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.
కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఖబడ్దార్
కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నాడు
కడియం శ్రీహరి లాగ కేసీఆర్ ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని తాకట్టు బెట్టుకొని, పదవుల కోసం పాకులాడి, బేరసారాలు చేయలేదు
తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, 13… https://t.co/Yy4wnbxX7G pic.twitter.com/623js92X2R
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2026