రైతుల గోస పట్టని సర్కార్
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.
- ధాన్యం విక్రయించాలంటే రోడ్డెక్కాల్సిందేనా?
- కొనుగోలు వేగవంతం చేయకపోతే ఆందోళనలు తప్పవు
- సర్కార్‌కు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరిక
- పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
దుబ్బాక, మే 20: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫ్యలంతోనే రైతులకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడ్డారు. బుధవారం నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దుబ్బాక మండలం రామక్కపేటలోని కొనుగోలు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సూమారు 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించినట్టు తెలిపారు. ఎక్కడ చూసినా రైతుల కన్నీళ్లు, కష్టాలే కన్పించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ మద్దరు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిద్రాహారాలు మానుకుని రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు కేవలం 20 శాతంలోపే ధాన్యం కొనుగోలు చేపట్టినట్టు తెలిపారు. కల్లాల్లో , కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 80 శాతం వరి ధాన్యం మిగిలిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటే.. రైతు, పేదల కష్టాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారిందని మండిపడ్డారు. విత్తనాలు మొదలుకొని చివరకు పండించిన పంటను విక్రయించే వరకు రైతులు రొడ్డేక్కి పోరాడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దొడ్డు రకం వరి కాకుండా వచ్చే వానకాంలో సన్న రకం వరి వంగడాలను సాగు చేయాలని రైతులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వానకాలంలో సన్న రకాల విత్తనాలకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. వరి సన్న రకానికి డిమాండ్ ఉన్నందున రైతులు ఆ వంగడాలను పండించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

