హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కక్షపూరిత రాజకీయాలు చేస్తూ పాలన సాగిస్తామంటే ప్రజలు క్షమించబోరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. హరీశ్‌రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ అవివేకమేనని పేర్కొన్నారు.
తాటాకు చప్పుళ్లకు తెలంగాణ బిడ్డలు భయపడరని హరీశ్‌రావు మీద కేసు పెడితే వెనక్కి తగ్గుతారని అనుకోవడం రేవంత్‌రెడ్డి సర్కారు అవివేకమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. అసలు కేసులకు భయపడితే తెలంగాణ రాష్ట్రమే వచ్చేదా? అని నిప్పులు చెరిగారు.
ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్న లు ఆగవనే సం గతి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి హెచ్చరించారు. కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడినంత మాత్రన ప్రశ్నలు రాకుం డా ఉంటా యా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): హరీశ్‌రావుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే ప్రజల తిరుగుబాటు తప్పదని టీఎస్‌టీపీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి హెచ్చరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు. మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు, నిర్బంధాలు చేసినా ప్రజల పక్షాన హరీశ్‌రావు కొట్లాడి తీరుతారని స్పష్టంచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావుపై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం పట్ల ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక చీటర్ అయిన చక్రధర్‌గౌడ్ కేసులు పెడితే ఎలాంటి ఆధారాలు లేకుండానే నమోదు చేయడం అత్యంత దారుణమని తెలిపారు.