రగిలిన రైతన్న ..ధాన్యంపై గళమెత్తిన ఎమ్మెల్యే
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆందోళనకు దిగడంతో సభ వేడెక్కింది.
- వడ్లు, మక్కల కొనుగోళ్లలో జాప్యంపై కన్నెర్ర
- కాంగ్రెస్ సర్కార్‌పై అన్నదాతల గరంగరం
- రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు
- కర్షకులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళనలు
- రైతులు ఏడుస్తుంటే సర్కార్ సంబురాలా?
- ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు
- ‘ప్రగతి ప్రణాళిక’లో కొత్త ప్రభాకర్‌రెడ్డి నిరసన
- అధికారులు మైక్ కట్‌చేయడంతో తీవ్ర ఆగ్రహం
- మైక్ విసిరేసి బయటకు వచ్చి ఆందోళన
- కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై తీవ్ర మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడమే కాదు.. పండిన పంటలను అమ్ముకోవడానికీ రైతులు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు, మక్కలు తెచ్చి రోజుల తరబడి మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. తిండీ తిప్పలు మాని కల్లాలు, సెంటర్ల వద్ద నిరీక్షిస్తున్నారు. కొనుగోళ్లలో జాప్యంతో రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు శనివారం సైతం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొని సర్కార్ వైఖరిని ఎండగట్టారు. ఓ దిక్కు వడ్లు, మక్కలు కొనేదిక్కు లేక అన్నదాతలు ఏడుస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పేరిటే సంబురాలు చేసుకోవడం ఏమిటని, రైతులకు ఏం మేలు చేశారని సంబురాలు చేసుకుంటారని నిలదీశారు.
దుబ్బాక, మే 2: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆందోళనకు దిగడంతో సభ వేడెక్కింది. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారని, చివరకు రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పం దించడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు కార్చుతుంటే.. ఇక్కడ ప్రజాపాలన పేరిట సంబురాలు ఏమిటని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభా వేదికపై కుర్చీలో కాకుండా రైతులతో కలిసి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మైక్ తీసుకుని రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండగా, అధికారులు మైక్ కట్ చేశారు. దీంతో మైక్‌ను విసిరేసి సభ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి మళ్లీ నిరసనకు దిగారు. ఫంక్షన్ హాల్ ఆవరణలో రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
రైతుల కన్నీరు కనిపిస్తలేదా?
ఓ వైపు ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఏడుస్తుంటే.. మరో పక్క ప్రభుత్వం ప్రజాపాలన పేరిట సంబురాలు నిర్వహించటం సిగ్గు చేటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి, మంత్రులకు, కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నం పెట్టే రైతుల సమస్యలు పట్టించుకోకుండా.. మంత్రులు, అధికారులు ఏసీ గదుల్లో ఉంటూ సంబురాల పేరిట కాలం వెళ్లదీయడం దురదృష్టకరమని అన్నారు. కలెక్టర్ కేవలం హుస్నాబాద్‌కే పరిమతమయ్యారని ఆరోపించారు. ఈ నిరసనలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతారవీందర్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను శాంతింపజేస్తున్న పోలీసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

