ప్రజల వెంట ఉండాలి
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో ప్రజల వెంట ఉండి సమస్యల పరిషారం కోసం నిరంతరం పోరాడాలని బీఆర్ఎస్ శ్రేణులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిసూచించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, అందరూ బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు.
- సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి
- బీఆర్ఎస్ శ్రేణులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిలుపు
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 5: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమయంలో ప్రజల వెంట ఉండి సమస్యల పరిషారం కోసం నిరంతరం పోరాడాలని బీఆర్ఎస్ శ్రేణులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిసూచించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, అందరూ బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ముందుగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, సమన్వకమిటీ సభ్యులు, కార్యకర్తలను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పారు.
ఈ సమయంలో మనమంతా రైతులు, పేదలు, సామాన్యుల పక్షాన నిలబడాలని, ఏ కష్టం వచ్చినా భరోసాగా నిలువాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు ఉంటే ముఖ్యంగా యూరియా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న బూత్ ఏజెంట్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కార్యకలాపాలతో బలమైన పునాది వేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఎన్నికలను సమర్థవంతంగా ఎదురొనేందుకు ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

