కార్మికులు కన్నెర్ర చేస్తే అభివృద్ధికి విఘాతం
ఆర్టీసీ కార్మికులు కన్నెర్న చేస్తే బస్సు చక్రాలు ఆగిపోవడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులు కన్నెర్న చేస్తే బస్సు చక్రాలు ఆగిపోవడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బస్ భవన్ నుంచి సమావేశ ప్రాంగణం వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పోకడలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రతి కార్మికుడికి ఊపిరి అందిస్తున్న సంఘం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ అని పేర్కొన్నారు.
భాగంగానే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మిక సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. శంకర్గౌడ్ ఆత్మ బలిదానంతో ప్రభుత్వం దిగి వచ్చి, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉన్నంతకాలం ఎంప్లాయీస్ యూనియన్ ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కే పద్మాకర్, అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

