సూర్యాపేట, జనవరి 11 (నమస్తే తెలంగాణ): గాంధీభవన్, సీఎంవో కేంద్రంగానే రాష్ట్రంలో ఘోస్ట్ రాతలు, ప్రచారాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసలు దొంగలెవరో గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే ఈ ప్రచారాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్షాలపై ప్రయోగించిన అస్ర్తాలనే నేడు సొంత పార్టీ నేతలపై వాడుతున్నారని, భస్మాసుర హస్తంలా వారి పాపాలు వారికే తగులుతున్నాయని విమర్శించారు. కొద్దిరోజులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై ఆదివారం సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు.
రాష్ట్ర రాజకీయాల్లో రెండేండ్లుగా అవా ంఛనీయ ఘటన లు చోటుచేసుకుంటున్నాయని, నా యకులపై అర్థంలే ని అసత్య ఆరోపణలు చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ సంస్కృతి రేవంత్ నాయకత్వంలోనే మొదలైందని మండిపడ్డారు. తమ పార్టీ నేత కేటీఆర్‌పై నాడు మంత్రులే స్వయంగా తప్పుగా మాట్లాడి వారి కుటుంబాల్లో ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేయగా, నేడు అవే వారికి తిరిగి తగులుతున్నాయని దుయ్యబట్టారు. అలాంటివి పుట్టించిన వాడెవడు? వాటిని ప్రసారం చేస్తున్నవాడెవడు? ఎందుకు పట్టుకోరు? దీని వెనుకాల ఉన్న పెద్దలవరు? అని నిలదీశారు. వీటి వెనుకాల ముఖ్య నేత ఉన్నాడని మంత్రులే బయట చెప్తారని, మీడియా ముందుకొచ్చి డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.
ఆ దుర్మార్గులను పట్టుకోలేరా?
తప్పుడు ఆరోపణలు చేస్తున్న, చేయిస్తున్న వారిని గుర్తించి మంత్రులు, ఐఏఎస్ అధికారులు కలిసి పట్టుకోలేరా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరిని మోసం చేయాలని, ఎవరిని అమాయకులను చేయాలని ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి వెంకట్‌రెడ్డికి ముందు నుంచే సోయి ఉండాల్సిందని చెప్పారు. గాంధీభవన్, సీఎంవో నుంచి నడుస్తున్న కొన్ని ఘోస్ట్ చానళ్లు, సైట్ల ద్వారా ఇలాంటి దుర్మార్గమైన ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, ఆ తర్వాతి తరానికి వాటిని అందించాలని హితవు పలికారు. రాజకీయ నాయకులు, అధికారులంటే ప్రజల్లో చులకన రావద్దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఆశీస్సుల కోసం, గురువు చంద్రబాబును తృప్తి పర్చేందుకే తెలంగాణకు వాటాగా దక్కాల్సిన జలాలను ఏపీకి అప్పగించే కుట్రలకు సీఎం రేవంత్‌రెడ్డి తెరలేపారని ధ్వజమెత్తారు.