హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంపై ఒక మంత్రికీ అవగాహనలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగి న వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని నిలదీశారు. బీఆర్ఎస్పై రాజకీయ ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఎస్ఏ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పినట్టు రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెకుల నీళ్లు వృథాగా పోతున్నాయని, పంప్‌హౌజ్‌లు నడిపితే కేసీఆర్‌కు పేరు వస్తుందని లిఫ్టులను ప్రారంభించడం లేదని విమర్శించా రు. ప్రభుత్వం పంప్‌హౌజ్‌లు నడపక మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూ రు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ప్రాజెక్టుల ద్వారా నీరివ్వాలని, లేకుం టే రైతుల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లాలోని సుమారు వెయ్యి మంది పోలీసులకు సరెండర్, టీఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పా డి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. తక్షణమే ఆ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నదని, ఈ రోజు వరకు ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో మాడల్ సూల్ టీచర్లకు జీతాలు రాలేదని విమర్శించారు.