రంగారెడ్డి : జిల్లాలోని అత్తాపూర్లో దారుణం చోటు చేసుకుంది. దుండగులు న్యాయవాది ( Advocate ) ని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. అత్తాపూర్లోని సులేమాన్ నగర్లో సొంత ఆఫీసులో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ (Mohmmad Khadir ) పనిచేసుకుంటుండగా అతడిపై దుండగులు కత్తులతో దాడి చేసి చంపి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహకారంతో ఆధారాలు సేకరించారు. కుటుంబ విభేదాల కోణంలో బామ్మర్దులపై అనుమానం వ్యక్తం చేశారు.సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.