నల్లగొండ : గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress ) రాష్ట్రా న్ని తిరోగమనంలో నడుపుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్యెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) విమర్శించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్కు పాలన చేతగాక వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. విద్య, వైద్యం అదోగతి పాలయిందన్నారు. ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు.
ఉన్నవి కూలగొట్టడం తప్పా.. కొత్తవి నిర్మించే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఇద్దరికి ఇద్దరు దద్దమ్మలాగా ఉన్నారని విమర్శించారు. కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో వారికి అవగాహన లేదని మండిపడ్డారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే..ఈ తొమ్మిది నెలలో పునరావతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్న పని చేస్తుండంటే అది కేసులు పెట్టించడం తప్పా వేరే పని ఏమీ లేదని విమర్శించారు.
విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడంట. ఇట్ల భయపెట్టించి రాజ్యం చేయడం ఎవరి వల్ల కాలేదు. చరిత్రలో ఎవరు నిలపడలేదన్నారు. అప్పుడే ఏం మొదలైందని పోలీసులు అడ్డం పెట్టుకుంటున్నారు. ముందుంది ముసళ్ల పండుగ. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అమలు చేయాలి. వెంటనే రాష్ట్రంలో రైతు భరోసాని అమలు చేయాలని డిమాండ్ చేశారు.