ఢిల్లీలో జై తెలంగాణ అనేది బీఆర్ఎస్సే
పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడేది, ఢిల్లీ గడ్డపై జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఎంపీలేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గులాబీ జెండా కప్పుకొన్నవాళ్లే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని, రాష్ర్టానికి ఎన్నటికైనా శ్రీరామరక్ష బీఆర్ఎస్సేనని తెలిపారు.
- కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
- సీఎం రేవంత్ ఏనాడూ జై తెలంగాణ అనలేదు
- బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సస్యశ్యామలం
- రైతుల నేస్తం కేసీఆరే: మాజీమంత్రి హరీశ్‌రావు
- చిన్నకోడూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం
సిద్దిపేట, ఏప్రిల్ 11: పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడేది, ఢిల్లీ గడ్డపై జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఎంపీలేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గులాబీ జెండా కప్పుకొన్నవాళ్లే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని, రాష్ర్టానికి ఎన్నటికైనా శ్రీరామరక్ష బీఆర్ఎస్సేనని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. గురువారం సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మం డలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యరి ్థ వెంకట్రామిరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. రైతులకు అన్నివిధాలుగా అండగా నిలిచి నిజమైన నేస్తంగా కేసీఆర్ నిలిచారని వెల్లడించారు. సాగునీటి కష్టాలను తొలగించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
రైతుబంధు, రైతుబీమా, పల్లెల్లోనే ధాన్యం కొనుగోళ్లు, నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా తదితర అనేక రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేసి అన్నదాతలకు చేయూతనిచ్చారని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో నిండా ఉన్న జలాశయాలను.. కాంగ్రెస్ పాలనలో ఎండిపోయి చూస్తున్నామని అన్నారు. కేసీఆర్ కాలుపెడితే పదేండ్లు కరువు లేదని, కాంగ్రెస్ వచ్చిన 3 నెలలకే మళ్లీ కరువును తెచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలోనే ఏపీ నుంచి గడ్డి తెచ్చి పశువులను కాపాడుకున్నామని గుర్తుచేశారు.
రేవంత్ ఏనాడూ జై తెలంగాణ అనలే
సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదని హరీశ్ ఆరోపించారు. ఆ నాడు జై తెలంగాణ అనేవాళ్లను కాల్చిపడేస్తానని అన్నారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి సీఎం కావటం మన దురదృష్టం అని విమర్శించారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 6 గంటల కరెంటు ఇస్తే, కేసీఆర్ రూ.90 వేల కోట్లు ఖర్చుచేసి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ వల్లే గోదావరి నీళ్లు వచ్చి పంటలు పండాయని, మనం ఇంత అన్నం ముద్ద తింటున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

