హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఆంక్షలు, కంచెలు, అరెస్టులు, నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహకుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరుఫున పోరాటం చేస్తున్న ప్రజాసంఘాల నేతల గొంతులునొకడం అమానుషమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్తోసహా అరెస్టయిన ప్రజాసంఘాల నేతలను తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేశారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి గారూ.. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తుచేస్తున్నారు. మీ సొంత జిల్లాలో నే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. గ్రామస్తుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సరారు నియంతృత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.