Danam Nagender | హైదరాబాద్ : చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) హల్ చల్ చేశారు. అధికారులు షాదన్ కాలేజ్ దగ్గర కూల్చివేతలు చేపడుతుండగా దానం నాగేందర్ వారిని అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చిన వారు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ దానం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు దానం నాగేందర్ హైడ్రాపై మాట్లాడుతూ.. స్లమ్ ఏరియాల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పానన్నారు. జలవిహార్, ఐమ్యాక్స్ లాంటివి చాలా ఉన్నాయని.. వాటిని కూల్చుకోవాలని సూచించారు. పేదల ఇండ్లను కూల్చడం సరికాదని దానం నాగేందర్ అన్నారు.
KTR | మోసకారి కాంగ్రెస్ సర్కారుపై.. ప్రజాతిరుగుబాటు మొదలైంది : కేటీఆర్