KTR | మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని.. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అసమర్థ ముఖ్యమంత్రి.. అసలు స్వరూపం బట్టబయలైందన్నారు. ఇక కాలయాపనతో కాలం సాగదని.. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదన్నారు. ఈ దరఖాస్తుల దందా నడవదని, ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదని హెచ్చరించారు. నమ్మించి చేసిన నయవంచనకు నాలుగుకోట్ల సమాజం ఊరుకోదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గ్రామసభలు అట్టుడికాయన్నారు. గ్రామసభలా.. ఖాకీల క్యాంప్ లా? అంటూ ప్రశ్నించారు.
సంక్షేమ పథకాల కోసమా..? కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా అన్నారు. ఖాకీల దౌర్జన్యాలు, కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు జరుగుతున్నాయన్నారు. పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా? అంటూ నిలదీశారు. ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా? ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా? ప్రశ్నించారు. పోలీసుల నడుమ.. అంక్షల నడుమ..పథకాలకు అర్హుల గుర్తింపట! అంటూ నిలదీశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
మోసకారి కాంగ్రెస్ సర్కారుపై
ప్రజాతిరుగుబాటు మొదలైంది..గ్యారెంటీల గారడీపై
జనగర్జన షురూ అయిందిఅసమర్థ ముఖ్యమంత్రి
అసలు స్వరూపం బట్టబయలైందిఇక కాలయాపనతో కాలం సాగదు
అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదుఈ దరఖాస్తుల దందా నడవదు
ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదునమ్మించి చేసిన నయవంచనకు… pic.twitter.com/Fyk2DJfl86
— KTR (@KTRBRS) January 22, 2025