హైదరాబాద్ : అరబిందో కంపెనీని(Aurobindo company) తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి నుంచి పంటపొలాలకు అరబిందో, హెటిరో, శిల్ప కంపెనీలు కలుషిత నీటిని విడుదల చేస్తున్నాయని స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలుషిత నీటి విడుదల ఆపకపోతే అరబిందో కంపెనీని తగలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే కలుషిత నీటి సరఫరా జరుగకుండా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అరబిందో కంపెనీని తగలబెడుతా
జడ్చర్ల మండలంలో పోలేపల్లి నుండి పంటపొలాలకు కలుషిత నీటిని విడుదల చేస్తున్న అరబిందో, హెటిరో, శిల్ప కంపెనీలు.
దీంతో కలుషిత నీటి సమస్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తెచ్చిన రైతులు.
కలుషిత నీటి విడుదల ఆపకపోతే అరబిందో కంపెనీని తగలబెడతానని వార్నింగ్… pic.twitter.com/JWeYyWb5hj
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024