హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టులో గురువారం ఓటుకు నోటు కేసు విచారణ జరగనున్నదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2015లో జరిగిన ఈ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికారని, బేరం కుదుర్చుకున్న రూ.5 కోట్లలో రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని చెప్పారు. 2017లో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిందని ఆయన గుర్తుచేస్తూ.. ఏడేైండ్లెనా దర్యాప్తు ముందుకు సాగకపోతే ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో మత్తయ్య, సెబాస్టియన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో నిందితులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా దొరల్లా తిరుగుతున్నారని, నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణకు సీఎం అయ్యారని, నోట్లు పంపిన వ్యక్తి మరోసారి సీఎం కావాలని తహతహలాడుతున్నారని చెప్పారు. ఓటుకు నోటుకు సంబంధించి సుప్రీంకోర్టులో 5 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.