Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో ‘ఖర్చు బారెడు ఫలితం జానెడు’ అన్నట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిందని, రూ.వేల కోట్లు ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టుల్లో అసలు ఆయకట్టే లేదని, కేవలం కొన్ని ప్రాజెక్టుల్లోనే నామమాత్రపు ఆయకట్టు సాధించారని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అడ్డగోలు వా దన చేస్తున్నది. కొన్ని ప్రాజెక్టులపై చేసిన ఖర్చు, పారిన ఆయకట్టు వివరాలతో ప్రజల ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నది.
కానీ, ఈ వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, బీఆర్ఎస్ కీర్తిని మసకబార్చేందుకే రేవంత్‌రెడ్డి సర్కారు ఈ అసత్య ప్రచారానికి తెరలేపిందని స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో అయినా తొలుత హెడ్‌వర్స్ (డ్యామ్‌లు, బరాజ్‌లు, స్పిల్‌వే గేట్లు, జలాశయాల పనులు) పూర్తి చేస్తారు. ఎత్తిపోతల పథకాలైతే పంప్‌హౌస్‌లు, సర్జిపూల్స్, విద్యుత్తు సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్లు, డెలివరీ సిస్టర్న్లు తదితర అనుబంధ నిర్మాణాలు పూ ర్తి చేస్తారు. వాటి పైనే ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేస్తాయి. ఆ తర్వాతనే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాన్ని చేపడతాయి.
ఎం దుకంటే.. అవి నిర్మించకుండా ఆయకట్టుకు నీరివ్వలేరు కాబట్టి. ఉమ్మడి ఏపీలో నిర్మితమైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల తదితర ప్రాజెక్టుల పనులు ఇదే రీతిలో జరిగా యి. 1963లో శంకుస్థాపన జరిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో హెడ్‌వర్స్ పూర్తయిన తర్వాత 1975లో తొలిసారి 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఆ తర్వా త దశల వారీగా ఆయకట్టును పెంచుతూ పో యారు. తద్వారా 2008-09 నాటికి ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు చేరుకున్నది. అంతే తప్ప ఈ మొత్తం ఆయకట్టు ఒకేసారే సాగులోకి రాలేదు. ఇతర అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే ప్రక్రియ కొనసాగింది. కానీ, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రాజెక్టుల ప్రధాన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. దీంతో సాగునీటి వసతుల కల్పనలో తెలంగాణ గత 8 ఏండ్లలో ఏకంగా 76.92% వృద్ధిని నమో దు చేసింది. తద్వారా దేశంలో అత్యధిక సాగునీటి వసతి కలిగిన టాప్-10 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
ప్రాజెక్టుల రీడిజైన్‌తోనే తెలంగాణకు మేలు
రీడిజైన్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తున్నది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైనవే. ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న సాంకేతిక, అంతర్రాష్ట్ర సమస్యలతోపాటు నీటి లభ్యత, నీటినిల్వ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ, ముంపు బాధితుల పునరావాస సమస్యలను తొలగించుకోవడానికి రీ ఇంజినీరింగ్ చేపట్టా ల్సి వచ్చింది.
తద్వారా అనుమతులను త్వరగా సాధించుకోవడానికి, పనులను వేగవంతంగా నిర్వహించకోవడానికి వీలైంది. రీ ఇంజినీరింగ్ ప్రాజెక్టుల్లో అత్యధికంగా విమర్శలకు గురవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభమైంది. 2019 నాటికి మేడిగడ్డ మొదలుకొని కొండపోచమ్మ జలాశయం వరకు అన్ని హెడ్వర్స్ను పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.93,872 కోట్లు ఖర్చు పెట్టింది. అయినా ఆ మూడేండ్లలోనే మొత్తం ఆయకట్టు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్నది. దీన్ని బట్టి విమర్శకులకు కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం తెలియదని స్పష్టమవుతున్నది.
ఎందుకంటే కాళేశ్వరం హెడ్ వర్స్‌లో అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బరాజ్‌లే కాకుం డా ప్రధాన పనుల కాంపొనెంట్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న వాటాను సమర్థంగా వినియోగించుకునేందుకు చేపట్టిందే కాళేశ్వరం. తెలంగాణలో మధ్య గోదావరి సబ్ బేసిన్‌లోని కడెం, స్వర్ణ నదులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన గోదావరిలో కలుస్తాయి. వాటి ద్వారా వచ్చే నీరు ఎల్లంపల్లి బరాజ్‌లోకి చేరుతాయి.
మా నేరు సబ్ బేసిన్లో నీటి ప్రవాహాలు చాలా స్వల్పం. వాస్తవానికి ఏటా 1,500 నుంచి 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీరంతా గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు కలిసిన తర్వాతే వస్తున్నట్టు ఇంజినీర్లు గమనించారు. భారీ ప్రవాహాలన్నీ పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి సబ్ బేసిన్ల నుంచి దిగువ గోదావరి సబ్ బేసిన్‌లోకి వస్తున్నట్టు గుర్తించారు. అంటే.. గోదావరిలో నీరు లభ్యమయ్యేది ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతమైన కాళేశ్వరం తర్వాతే. దిగువ గోదావరి సబ్‌బేసిన్‌లో కాళేశ్వరం వద్ద ప్రాణహిత కలిసిన తర్వాత 40 ఏండ్ల ప్రవాహాలను గమనిస్తే ఏటా సగటున 1,651 టీఎంసీల ప్రవాహాలు ఉంటాయని తేలుతున్నది.
అయితే ఈ ప్రవాహాలను వృథాగా సముద్రంలోకి వదిలేయకుండా సమర్థంగా వినియోగించుకునేందుకే గత ప్రభుత్వం కాళేశ్వరం, సమ్మకసాగర్, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను చేపట్టింది. కృష్ణా బేసిన్లో ప్రధాన ప్రాజెక్టు అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్ చేసింది. ఈ వాస్తవాన్ని మరుగుపర్చేందుకే రేవంత్ సర్కారు కుట్రకు తెరలేపింది. నాడు కేసులు వేసి పాలమూరు, డిండి, సీతారామ ఎత్తిపోతల పనులను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే నేడు అధికారంలోకి వచ్చాక ఆయకట్టు రాలేదని దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం.
లోతైన పరిశీలన లేకుండానే ఆరోపణలు
మేడిగడ్డ మాదిరిగా అన్నారం, సుందిల్ల బరాజ్‌లు కూడా కూలిపోతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ వినాగం నివేదికలివ్వడం, వాటిని సాకుగా చూపుతూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే.. బరాజ్‌లో కుంగుబాటుకు కారణమేమిటన్నది పునాది పరిశీలన, భూభౌతిక పరీక్షల తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయని, కుంగుబాటుకు సంబంధించిన వివరాలు, కారణాలు మరో వారం రోజుల్లో తెలుస్తాయని అధికారులు చెప్తున్నారు.
ఇటీవల మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డికి అక్కడి అధికారులే స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు కేవలం 2 గంటలపాటు బరాజ్‌ను సందర్శించారు. పైపై పరిశీలన ఆధారంగా అనేక ఆరోపణలు, అంచనాలతోనే ఊహాజనిత నివేదికను విడుదల చేశారు. ఆ నివేదికల్లోని అంశాలను తిరసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీర్లు ఇప్పటికే సవివరమైన జవాబులు అందజేశారు. భూభౌతిక పరీక్షల ఫలితాలను పంపాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది. విజిలెన్స్ అధికారులు కూడా ఎన్డీఎస్ఏ బృందం తరహాలోనే బరాజ్‌లను సందర్శించి, ఎలాంటి పరీక్షలు చేయకుండానే నివేదికను సమర్పించారు.
అయినా ఆ నివేదికలే తమకు శిరోధార్యమన్నట్టు రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్నది. తద్వారా గత బీఆర్ఎస్ సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఎంతో విలువైన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపేందుకు పాకులాడుతున్నది. వాస్తవానికి మొత్తం 8 బ్లాకులున్న మేడిగడ్డ బరాజ్‌లో కేవలం 7వ బ్లాక్‌లో మాత్రమే కుంగుబాటు జరిగిందని, మిగతా బ్లాకులన్నీ సురక్షితంగా ఉన్నాయని అధికారులే వెల్లడిస్తున్నారు. కానీ, అందుకు భిన్నంగా అన్నారం, సుందిల్ల బరాజ్‌లు కూడా ప్రమాదపుటంచున ఉన్నాయని రేవంత్ సర్కారు దుష్ప్రచారం చేస్తున్నది. దీన్ని కట్టిపెట్టి మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెడితేనే రైతులకు, రాష్ర్టానికి ప్రయోజనం చేకూరుతుంది.
పదేండ్లు కాపాడితే.. 2 నెలల్లో అప్పగింత
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ ఆధీనంలోకి పోకుండా పదేండ్లపాటు కాపాడిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుల అప్పగింతకు ముందస్తుగా కేంద్రానికి అనేక షరతులు విధించింది. వాటిని నెరవేర్చితే తప్ప ప్రాజెక్టులను అప్పగించేది లేదని అనేక సమావేశాల్లో తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్ర ప్రభుత్వం 2020 జులై 15న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా తిరస్కరించింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిన రేవంత్ సర్కారు..
తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టింది. పైపెచ్చు ఆ తప్పును గత బీఆర్ఎస్ సర్కార్‌పై వేయాలని చూస్తున్నది. ఇదిలావుంటే, కేంద్రంతో రాజీలేని పోరాటం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. సెక్షన్ 3 కింద అదనపు నిబంధనలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నివేదించేలా చేసింది. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృషా ్ణజలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 575 టీఎంసీల వాటాను సాధించేందుకు కృషి చేయాల్సి ఉన్నది. కానీ కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికే ప్రాజెక్టులను అప్పగించిన రేవంత్ సర్కారు మన నీటి వాటాను సాధిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి.